సెల్ ఫోన్ తోనూ హెచ్ఐవీ గుర్తింపు !
తక్కువ ఖర్చుతో హెచ్ఐవీని గుర్తించే అతిచిన్న పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. సెల్‌ఫోన్, నానోటెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ పరికరం హెచ్ఐవీ వైరస్‌ను గుర్తిస్తుంది. నానోటెక్నాలజీ, మైక్రోచిప్, సెల్‌ఫోన్, త్రీడీ ప్రింటెడ్ ఫోన్ అటాచ్‌మెంట్‌ను ఉపయోగించి పరిశోధకులు ఈ పరికరాన్ని రూపొందించారు. అది ఒక్క చుక్క రక్తంతోనే హైఐవీ వైరస్‌లోని ఆర్ఎన్ఏ న్యూక్లియిక్ యాసిడ్స్‌ను గుర్తించి ఆ వివరాలను మొబైల్‌పై చూపిస్తుంది. ఈ పరికరంతో గంటలోపే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఒక్కో పరీక్షకు రూ.350లోపే ఖర్చవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.













