హ్యూస్టన్ లో ‘యాత్ర’ సినిమా ప్రి-రిలీజ్ వేడుక
హ్యూస్టన్ నగరంలో యాత్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల మధ్య సంబరంగా జరిగింది. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ జగన్ అభిమానులు అంతా కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బయట వాతావరణం గడ్డకట్టుకుపోయేలా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ను చూసేందుకు తరలి వచ్చారు.
ముందుగా అందరు ఒక చోట చేరి అక్కడి నుండి దాదాపు 200 వాహనాలలో బయలు దేరి 2 మైళ్ళు ర్యాలీ చేసి సినిమా హాల్ ప్రాంగణానికి చేరుకున్నారు. సినిమా హాల్ లోపల కేక్ కట్ చేసి జోహార్ వైస్సార్ మరియు జై జగన్ అనే నినాదాలతో థియేటర్ మొత్తాన్ని హోరెతించారు. సినిమా బాగా తీశారంటూ వారు చిత్ర దర్శకునికి, నిర్మాతలకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.













