హిందీ సాహిత్య సదస్సుకు అధ్యక్షత వహించనున్న యార్లగడ్డ
తెలుగు ప్రముఖునికి మరో విశిష్టత లభించింది. మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (వైఎల్పీ) ఈనెల 17 నుంచి కెనడా వేదికగా జరిగే అంతర్జాతీయ హిందీ సాహిత్య సదస్సు-2018కి అధ్యక్షత వహించనున్నారు. అంతర్జాతీయ హిందీ సాహిత్య సదస్సుకు అధ్యక్షత వహించాలని కోరుతూ ఒక తెలుగువాడికి ఆహ్వానం రావడం ఇదే తొలిసారి. సదస్సు అనంతరం వైఎల్పీ అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల్లో హిందీ ఫ్యాకల్టీ సమావేశాల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ వేదికపై తెలుగువాడికి అరుదైన గౌరవం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.













