అమెరికా ప్రెసిడెంట్ పదవికి తెలుగువాళ్లు పోటీ పడాలి…
డెట్రాయిట్ తెలుగు సంఘం(డీటీఏ) 40వ వార్షికోత్సవాల్లో కీలకోపన్యాసం చేసిన పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తానా మాజీ అధ్యక్షులు, డెట్రాయిట్ ప్రాంతానికి చెందిన డా.ముక్కామల అప్పారావు, డా.బాబీ ముక్కామల. కాట్రగడ్డ కృష్ణప్రసాద్ వంటివారు స్థానిక సెనేటర్లు, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో ఎంతో చొరవగా మసులుతున్నారని, ఇవి కేవలం పరిచయాలుగా మిగిలిపోకుండా తమ తర్వాతి తరానికి మరింత గుర్తింపు, బలం చేకూర్చే విధంగా తమ పిల్లలను అమెరికా రాజకీయాల వైపు ఉద్యుక్తులను చేసే విధంగా ప్రోత్సహించాలని కోరారు. అమెరికన్ రాజకీయ నాయ్కులు భారతీయుల శక్తి, యుక్తులను గుర్తించి అడిగిన వెంటనే ఇటువంటి సభలకు తరలివస్తున్నారని, వారికి మన సత్తా తెలిసినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రవాస యువతను రాజకీయల వైపు ఆకర్షించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. భారతీయత నేర్పిస్తూనే, భారతదేశం చూపిస్తూనే, వారిలోని ఆ అమెరికత్వానికి ద్వైతిభావనతో గౌరవం చేయాలని కోరారు. అనంతరం మేరీల్యాండ్ ప్రతినిధుల సభ సభ్యురాలు కాట్రగడ్డ అరుణా మిల్లర్ మాట్లాడుతూ తనకు ఎంతో ఇచ్చిన అమెరికాకు తాను కేవలం ప్రజాసేవ ద్వారా మాత్రమే తిరిగి రుణం తీర్చుకోగలనని విశ్వాసం చేతనే రాజకీయాల్లోకి అడుగిడానని తెలిపారు.
డా.ముక్కామల బాబీ మాట్లాడుతూ తెలుగువారు గర్వించే స్థాయిలో మిషిగన్లో నివసిస్తున్నారని, ఐకమత్యంగా సాగితే అద్భుతాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. అనంతరం వేడుకల చైర్మన్ కోనేరు శ్రీనివాస్, సమన్వయకర్త మారెంరెడ్డి సాగర్, అధ్యక్షుడు అంచె హర్షల నేతృత్వంలో ప్రముఖులను ఘనంగా సత్కరించారు.













