శ్రీ అనఘదత్త సొసైటీ ఆధ్వర్యంలో వైభవంగా యాగ పూజలు
కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ ( శ్రీ సాయి బాబా మందిరం) ప్రపంచ శాంతి కొరకు సుదర్శన యాగం
* కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ(శ్రీ సాయిబాబా మందిరం) వారు పంచాయతన పూజలు, యాగాలు, నిత్య పూజలు మూడు సంవత్సరాలకు పైగా భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకులు శ్రీమతి లలిత, శ్రీ. శైలేష్ తెలుగు ఉగాది పర్వ దినము నుండి వసంత పంచమి ఏప్రిల్ 26 వరకు ఆలయం లో నిత్య పూజలు, యగాల్ని సంకల్పించారు.
** శ్రీమతి లలిత, శ్రీ శైలేష్ ఆలయ నిర్మాతలు, వేద పండితుడు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రాజకుమార్ శర్మ గారు ఎంతో మంది వాలంటీర్లతో యాగ పూజలు వైభవంగా జరిగింది.
* ఉదయం నుండి జరిగిన కార్యక్రమములో జ్యోతి ప్రజ్వలన, గురువందనం, చతుర్వేద పారాయణం, ప్రస్తుత కరోనా విముక్తి కొరకు యోగ వసిష్ఠ మంత్రం ఉచ్ఛరణ, మహా సుదర్శన యాగం మార్చ్ 28 న సాంప్రదాయ బద్దంగా జరిగాయి. యాగం ఏప్రిల్ 26 న లక్ష్మి నారాయణ శాంతి కళ్యాణం తో పరిసమాప్తం అవుతుంది.
* వేద పారాయణ, నిత్య అగ్నిహోత్రం, పూజలు, యాగాల వల్ల ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వంటి వ్యాధులు ప్రబలకుండా భగవంతుడు కాపాడతాడు. సర్వేజనా సుఖినోభవంతు, దైవ స్మరణల తో శ్రీమతి లలిత శైలేష్ దంపతులు గట్టి నమ్మకం తో ఈ సత్కార్యానికి దైవ సంకల్పం తో ముందుకు వచ్చారు. దైవ నమ్మకమే అన్నింటికీ గట్టి పునాది.
** అందరికి శ్రీ వారి ఆశీస్సులు పరి పూర్ణంగా ఉండాలని వేద ఆశీర్వచనం తో శ్రీ సీతారామ కళ్యాణం ముగిసింది. వసంత పంచమి ఏప్రిల్ 26 తో యాగ క్రతువులు పరిసమాప్త మవుతుంది .అతిథులకు మహా నేవేద్యం ఇవ్వడం జరిగింది.













