రూ.13,499కే ఢిల్లీ-వాషింగ్టన్ ప్రయాణం
ఐస్లాండ్ కేంద్రంగా పనిచేసే విమానయాన సంస్థ వావ్ ఎయిర్ చౌక ధరల ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.13,499కే ఢిల్లీ నుంచి అమెరికా, కెనడాల్లోని పలు గమ్యస్థానాలకు విమానయాన అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నెల 18న మొదలైన టికెట్ల విక్రయం 28న ముగియనుంది. ఈ ఏడాది డిసెంబరు నుంచి 2019 మార్చి మధ్యలో ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డిసెంబరు 7న ఢిల్లీ నుంచి ఐస్ లాండ్‌లోని సంస్థ ప్రధాన కేంద్రమైన రేజా విక్కు విమానాలను ప్రారంభించనున్నట్లు వావ్ ఎయిర్ తెలిపింది.
ఉత్తర అమెరికా, ఐరోపాలను కలుపుతూ, ఢిల్లీకి వారానికి మూడు సార్లు విమానాలను వావ్ ఎయిర్ నడపనుంది. జనవరి నుంచి వీటిని వారానికి అయిదు సార్లుకు పెంచనుంది. అమెరికాలోని చికాగో, ఓర్లాండ్, నెవార్క్, డెట్రాయిట్, శాన్ఫ్రాన్సిస్కో, బాల్టిమోర్, బోస్టన్, పిట్స్బర్గ్, లాస్ ఏంజెలిస్, వాషింగ్టన్ డీసీ, సెయింట్ లూయిస్ లకు ప్రయాణికులు రూ.13,4999తో ప్రయాణం చేయొచ్చు అని వావ్ ఎయిర్ తెలిపింది. టోరంటో, మాంట్రియల్‌కు కూడా కంపెనీ విమానాలు నడపనుంది.













