84 వేల కోట్ల సాయం : ప్రపంచ బ్యాంకు
కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు ఆర్థిక సాయం చేయడానికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 12 బిలియన్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.84,000 కోట్లు) ప్యాకేజీని ప్రకటించింది. సాయంకోరే దేశాలకు ఈ నిధులను అందజేసి ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ చెప్పారు. ముఖ్యంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద దేశాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తద్వారా ఆయా దేశాలు వైద్య పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చని, కరోనా విస్తరించకుండా అడ్డుకోవడానికి చర్యలు తీసుకునే అవకాశముంటుందని పేర్కొన్నారు.













