ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేస్తాం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం అభ్యర్థనల మేరకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. రాజధాని అమరావతి ప్రాజెక్టుకు సహాయం నిలిపివేయడానికి కారణం.. కేంద్రం తన అభ్యర్థనను ఉపసంహరించుకోవడమేనని ఓ ప్రకటనలో పేర్కొంది. అఇయతే ఆంధ్రప్రదేశ్‌తో తమ సంబంధం ఈనాటిది కాదని, మహిళా సహాయ బృందాలకు సంబంధించిన కార్యక్రమంలో పాలుపంచుకున్నామని గుర్తు చేసింది. ఈ కార్యక్రమం అద్భుతమైన అభివృద్ధికి దారితీసిందని, ఇతర దేశాలకు కూడా మార్గదర్శకంగా నిలిచిందని బ్యాంకు ప్రశంసించింది. ఆరోగ్యం, ఇంధన, వ్వవసాయం, విపత్తు నిర్వహణ తదితర రంగాల్లో 100 కోట్ల డాలర్లకు పైగా సహాయం చేస్తామని, ఇందులో భాగంగానే గత జూన్ 27న 32.8 కోట్ల డాలర్లతో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేశామని తెలిపింది.













