వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇబ్బందులు : సత్య నాదెళ్ల
కొవిడ్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) సంస్క•తి పెరిగిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇదేం కొత్త కాకపోయినా.. వరుసగా ఇన్ని నెలల పాటు చేయడం మాత్రం కొత్తే. ఈ క్రమంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ఆన్లైన్ సమావేశాలు ఉద్యోగులను అలసిపోయేలా చేస్తున్నాయని, ఉద్యోగ-వ్యక్తిగత జీవితాల మధ్య తమ ఆలోచనాధోరణిని మార్చుకోవడం వారికి కష్టంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు.
కొన్ని సందర్భాల్లో పని చేసే చోట నిద్రిస్తున్నట్టుగా ఉంటుందన్నారు. రోజూ ఉదయాన్నే మొదటి వీడియా సమావేశంలో 30 నిమిషాలపాటు ఏకాగ్రతతో ఉండాల్సి రావడం వల్ల ఉద్యోగులకు అలసట వచ్చేస్తోందన్నారు. ఆఫీసుకు రావడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను ఇంటి నుంచి పనిచేసేటప్పుడు కోల్పోతారన్నారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం సాధించడమెలాగో కరోనా మహమ్మారి తనకు నేర్పిందని చెప్పారు.













