న్యూజెర్సీలో అలరించిన ‘వేటా’ బతుకమ్మ సంబరాలు
ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) ఆధ్వర్యంలో న్యూ జెర్సీ సిటీ, మన్రో టౌన్షిప్ సాయి బాలాజీ దేవాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పూలతో అలంకరించిన 12 అడుగుల బతుకమ్మ మరియు అమ్మవారు విగ్రహం మధ్య కొలువుదీరిన గౌరమ్మను చూసి ఆడిపాడి దర్శించేందుకు దాదాపుగా 1000 మంది విచ్చేశారు. మధ్యాహ్నం 4 గంటలకు లలితా సహస్ర నామ పూజతో కార్యక్రమం ప్రారంభమయింది. భారతదేశం నుంచి తెప్పించిన సహజసిద్ధమైన పూలతో బతుకమ్మను తంగేడు, కట్ల, గునుగు, బంతి, గుమ్మడి, బీర, అస్తెర్ మొదలగు పూలతో అందముగా అలంకరణ చేశారు. ప్రముఖ సినిమా తార, టీవీ యాంకర్ ఉదయభాను ఆహుతులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ ఆడడమే కాకుండా వివిధ కార్యక్రమాలతో కార్యక్రమానికి వచ్చిన వారందరిని అలరించారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికి ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల, అడ్వైజరీ కౌన్సిల్ కో-చైర్ డా. అభితేజ కొండా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమం సుగుణ రెడ్డి, జయశ్రీ తెలుకుంట్ల, ప్రీతి రెడ్డి, చైతన్య పోలోజు పర్యవేక్షణలో జరిగింది. వాలంటీర్లు ప్రత్యూష, మాధురి, చరణ్ తదితరులు సహాయపడ్డారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సూర్యనారాయణ, రామకృష్ణ, రమేష్, టిపి శ్రీనివాస్, వంశీ, సలహాదారులు ప్రసాద్, సుబ్బారావు, మహేష్ తదితరులకు కూడా వేటా టీం కృతజ్ఞతలు తెలియజేసింది.
శాన్రామన్లో…
కాలిఫోర్నియా బే ఏరియా శాన్ రామోన్ నగరంలో ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేటా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శాన్ రామోన్ స్పోర్ట్స్ పార్క్ లో నిర్వహించిన ఈ వేడుకలలో బే ఏరియాలోని వివిధ నగరాల నుంచే కాకుండా శాక్రమెంటో లాంటి సమీప పట్టణాల్లో నివసించే తెలగువారందరూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇండియన్ కాన్సులర్ జనరల్ డా. టీవీ నాగేంద్ర ప్రసాద్, అయన సతీమణి పద్మావతి హాజరయ్యారు. వేటా చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొని వేటా టీంని అభినందించారు. ఈ కార్యక్రమానికి శాన్ రామోన్ నగరానికి వైస్ మేయర్ తెలుగు వాడు అయిన శ్రీధర్ వేరోసి, పార్క్స్ చైర్ పర్సన్ హైది కెన్స్టన్ కూడా హాజరయ్యారు. అలాగే బే ఏరియా లో వుండే వివిధ తెలుగు సంఘాల సభ్యులు కూడా పాల్గొని సంఫీుభావాన్ని తెలియ చేశారు. శాన్ రామోన్ స్పోర్ట్స్ పార్క్ ఆవరణలో పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని జానపద పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సంవత్సర వేడుకలలో ప్రముఖ సినిమా తార, టీవీ యాంకర్ ఉదయ భాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఉదయభాను ఆహుతులతో కలిసి ఆనందోత్సవాల నడుమ బతుకమ్మ ఆడడమే కాకుండా వివిధ కార్యక్రమాలతో కార్యక్రమానికి వచ్చిన వారందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి పలు తెలుగు పండుగ వంటకాలతో భోజన ఏర్పాట్లను చేశారు.ఈ కార్యక్రమం వేటా ప్రెసిడెంట్ రaాన్సీ రెడ్డి హనుమాండ్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ మరియు మీడియా పార్టనర్స్ కి ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరిని వేటా ప్రెసిడెంట్ రaాన్సీ రెడ్డి హనుమాండ్ల, అడ్వైజరీ కౌన్సిల్ కో-చైర్ డా. అభితేజ కొండా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, నేషనల్ మీడియా చైర్ సుగుణ రెడ్డి ధన్య వాదాలు తెలియచేసారు. కార్యక్రమంలో లక్ష్మి యాన, జాయింట్ ట్రెజరర్ యశశ్విని రెడ్డి, కల్చరల్ చైర్ రత్నమాల వంక, కోశాధికారి విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, పూజ రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల, జాయింట్ సెక్రటరీ ప్రశాంతి కూచిబొట్ల, వాలంటీర్లు దివ్య, రేఖ, సునీత గంప, చందన రెడ్డి, మాధురి రెడ్డి, దివ్య, భువన్ వేమిరెడ్డి పాల్గొన్నారు.













