ఘనంగా జరిగిన ‘వేటా’ బతుకమ్మ సంబరాలు
బతుకమ్మలతో మురిసిన ఫెయిర్‌ఫ్యాక్స్, హ్యాంఫోర్డ్ ప్రాంతాలు
తెలంగాణలో ఊరూ వాడా పూలజాతర సందడి చేస్తున్నట్టే అమెరికాలో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపారు. ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్(వేటా)’ స్థాపించినప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం జరిగిన వేడుకల్లో ప్రముఖ సినిమా తార /టీవీ, యాంకర్ ఉదయభాను ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.
వర్జీనియా రాష్ట్రంలోని ఫెయిర్‌ఫ్యాక్స్ నగరంలో జరిగిన వేడుకల్లో మహిళలు, చిన్నారులు, పెద్దలు పాల్గొన్నారు. ప్రకృతి మురిసిపోయేట్టు రంగురంగుల పూలను పేర్చి ఆడుకునే రంగుల పండుగ బతుకమ్మ ఇక్కడి ఎస్వి. లోటస్ టెంపుల్ ఆవరణలో ఘనంగా జరిగింది. పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని… ‘‘ఒక్కొక్క పువ్వేసి చందమామా…ఒక్క జాము గడిచె చందమామా’’, ‘‘బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో ‘‘ అంటూ అనేక జానపద పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రాదారణలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. అంతా కలసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు. మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో ‘‘బతుకమ్మ పండుగ’’ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే.
ఉదయ భాను ఆహుతులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ ‘‘బతుకమ్మ ఆడడమే కాకుండా’’ వివిధ కార్యక్రమాలతో కార్యక్రమానికి వచ్చిన వారందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 800 మంది పెద్దలు, పిల్లలు వచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ వేటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల, అడ్వైజరీ కౌన్సిల్ కో-చైర్ డా. అభితేజ కొండా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, నేషనల్ మీడియా చైర్ సుగుణ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం వర్జీనియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జయశ్రీ తెలుకుంట్ల, మేరీల్యాండ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి, రీజినల్ కల్చరల్ చైర్ చైతన్య పోలోజు, రీజినల్ కోర్ కమిటీ స్మృతి రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. సతీష్ వడ్డే, సుధ పాలడుగు, సతీష్ వేమన, శ్రీధర్ నాగిరెడ్డి, విశ్వేశ్వర్ కలవాల, కాంగ్రెస్ మహిళ జెన్నిఫర్ వెక్స్టన్ హాజరయ్యారు. గ్రీన్ అండ్ బీయాండ్ సిరి కొంపల్లి 500 మొక్కలు ఇచ్చారు.
హ్యాంఫోర్డ్లో…
హ్యాంఫోర్డ్ నగరంలో కూడా ‘వేటా’ ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. ప్రకృతి మురిసిపోయేట్టు రంగురంగుల పూలను పేర్చి ఆడుకునే రంగుల పండుగ బతుకమ్మ ఇక్కడ కాలిఫోర్నియాలోని హ్యాంఫోర్డ్ నగరంలో వేటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల బంగ్లా ఆవరణలో బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని, ‘‘ఒక్కొక్క పువ్వేసి చందమామా…ఒక్క జాము గడిచె చందమామా’’, ‘‘బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో’’ అంటూ అనేక జానపద పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రాదారణలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. అంతా కలసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది పెద్దలు, పిల్లలు వచ్చారు. ఈ కార్యక్రమం వేటా(WETA) ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఫుడ్ స్పాన్సర్ చేసిన డా. కాంతం, సుజాత గాదెకి ఝాన్సీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేటా ట్రేజరర్ విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, ఆర్విపి పూజ రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల తదితరులు పాల్గొన్నారు.













