NATS: సంబరాల్లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ ద్వైవార్షిక తెలుగు మహాసభలు ‘‘అమెరికా తెలుగు సంబరాలు’’ పేరుతో జూలై 4,5,6 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంబరాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ అంశాలపై నిష్ణాతులతో ప్రసంగాలను ఏర్పాటు చేయించారు.
మహిళలు మరియు ఆరోగ్య ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నది. మహిళలకు మానసికోల్లాసం వనితలకు విజ్ఞాన వికాసం అతివలకు ఆర్థిక ప్రకాశం అన్న ఉద్దేశ్యంతో నాట్స్ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
ఇందులో ఎంతోమంది నిష్ణాతులు మహిళల సమస్యలపై, ఇతర అంశాలపై మాట్లాడనున్నారు.
డాక్టర్ మాధవి వెనిగల్ల ఎం.డి.(బోర్డ్ సర్టిఫైడ్ హెర్మటాలజిస్ట్/ఆంకాలజిస్ట్) క్యాన్సర్ ప్రివెన్షన్‌పై మాట్లాడుతారు.
డాక్టర్ విజయ బసవరాజు (క్లినికల్ సైకాలజిస్ట్) మిడిల్ లైఫ్‌లో ఎమోషనల్ వెల్‌నెస్ పౖ మాట్లాడుతారు.
డాక్టర్ ప్రియాంక కరపాష (పీడియాట్రిక్ డెంటిస్ట్) డెంటల్ అవేర్‌నెస్ పై మాట్లాడుతారు.
స్వప్న రావిపతి (హోమియోపతి) హోమియోపతి వెనుక ఉన్న తత్వశాస్త్రంపై మాట్లాడనున్నారు.
అనిరుధమిర్యాల (రచయిత్రి, మహిళా సాధికారత కోచ్) బాధ, ఆనందం వంటి విషయాలపై మాట్లాడనున్నారు. అలాగే మన శరీరాన్ని మనం ఎలా అదుపు చేసుకోగలం అన్న విషయంపై కూడా మాట్లాడనున్నారు.
దేవి దొంతినేని (యునైటెడ్ స్టేటస్ నావల్ అకాడమీ) కెరీర్ ఎంపికగా నేవీ ఎంచుకోవడం అన్న అంశంపై మాట్లాడుతారు.
దీంతోపాటు మహిళలకోసం ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. జూన్ కిట్టే, హెన్నా టాటూ స్టేషన్ల ద్వారా యోగా, ఉత్సాహాన్ని తెచ్చిపెట్టే ఆటలు బహుమతులు, డేకేర్ సేవలు (వ్యక్తిగత ఖర్చులతో) వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.







