ఆటాపాటలతో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
కాన్సస్ సిటీలో మహిళా దినోత్సవ వేడుకలను ఆటపాటలతో కోలాహలంగా నిర్వహించారు. కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ‘మహిళా దినోత్సవ’ వేడుకలను నాట్స్, తానా, ఆటా సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ వేడుకల్లో వందలాది మంది ప్రవాసులు సకుటుంబ సపరివారసమేతంగా పాల్గొన్నారు. ఈ మహిళా దినోత్సవ వేడుకలు కాన్సస్‌లో జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పాటలు, న త్యాల కార్యక్రమాలు ప్రవాసులందరిలో ఉత్సాహాన్ని నింపాయి.
ఈ మహిళా దినోత్సవ వేడుకలకు.. ప్రముఖ టీవీ యాంకర్, నటి, గాయని ఉదయభాను ఆత్మీయ అతిథిగా హాజరయి.. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మిన్నంటిన కరతాళ ధ్వనుల మధ్య నాట్స్ కాన్సస్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి.. ఉదయభానును వేదికపైకి ఆహ్వానించారు. వినాయకుడి పూజ అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను భారతదేశంలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో చిన్నారుల చదువు, మహిళా సాధికారత, చేనేతల అభివ ద్ధి కోసం వెచ్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా చేనేత ఉత్పత్తులను అమెరికాలో ప్రోత్సహించాలని, అందుకోసం ప్రవాసులు విరివిగా ప్రచారం కల్పించాలని కోరారు. వేడుకలు జరిగిన ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ‘సిద్ధిపేట చేనేత దుస్తుల స్టాల్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలంతా చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు.
బిందు చీదెళ్ళ ఆధ్వర్యంలో ‘కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్’ మరెన్నో కార్యక్రమాలను నిర్వహించి చైల్డ్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా నాట్స్ నిర్వహించిన బోన్ మారో డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ సంస్థ సేవాదళం సభ్యులు రుచికరమైన ఆహారాన్ని అందించారు.
ఉదయ భాను వివిధ ‘ఫ్యామిలీ గేమ్ షో’లతో, సరదా ఆటలతో అందరినీ అలరించారు. చిన్న పిల్లలు చేసిన దేశ భక్తుల రూపకం, ఇటీవల మరణించిన ప్రముఖ నటి శ్రీదేవికి నివాళిగా అర్పించిన కార్యక్రమం, బాలీవుడ్ డాన్స్, ఫ్యాషన్ షో, బాలలు ఆలపించిన పాటలు, సంప్రదాయ, ఫ్యూజన్ న త్యాలు, తదితర ప్రదర్శనలు ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిందు చీదెళ్ల, వైస్ ప్రెసిడెంట్స్ దినేష్ చినలచయ్యగారి, మహతి మంద, శ్రీదేవి గొబ్బూరి, సునీల్ ముడుసు, ప్రోగ్రాం చైర్ గౌరీ చెరుకుమూడి, చైతన్య రంగిని, సెక్రటరీ విజయ్ కొండి, బోర్డు మెంబెర్స్ వెంకట పుసులూరి, కిరణ్ కణకడందుల, విశ్వమోహన్ అమ్ముల, శ్రీనివాస్ తలగడదీవి, వెంకట్ రావు, రాజేంద్ర చీదెళ్ళ, ప్రశాంత్ ఠాకూర్, రఘు, వేణు, మన్మోహన్, సుచరిత వాసం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలందించిన నాట్స్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి, వెంకట్ మంత్రి, ప్రసాద్ ఇసుకపల్లి, వెన్నెల నీతిపూడితోపాటు తానా, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వారికి నిర్వాహకులు ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలుపారు.













