ఇన్స్టాగ్రామ్ రీల్స్ ను ప్రారంభించిన ఫేస్బుక్
ఫేస్బుక్ సంస్థకు చెందిన ఇన్స్టాగ్రామ్ యాప్.. టిక్‌టాక్ లాంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ను ప్రారంభించింది. ఇందులో వినియోగదారులు 15 సెకన్ల నిడివిగల వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. వీడియోలను పలు రకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కెమెరాకు కింది భాగంలో రీల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. అయితే వివిధ రకాల యాప్‌లను ఫీచర్లను ఫేస్బుక్ కాపీ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. స్నాప్‌చాట్‌లో కనిపించే స్టోరీ ఫీచర్‌ను ఫేస్బుక్ ఇప్పటికే తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో, భారత్‌లో టిక్‌టాక్‌పై బ్యాన్ విధించడంతో దాని ద్వారా వినియోగదారులను పెంచుకోవడమే లక్ష్యంగా ఫేస్బుక్ ఈ ఫీచర్‌ను ఎంచుకుంది.













