డొనాల్డ్ ట్రంప్ తో మాకు ముప్పు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో భారత ఐటీ రంగానికి పెనుముప్పు పొంచి ఉందన్న అంచనాలు నిజమవుతున్నాయి. తొలిసారిగా, భారతీయ ఐటీ దిగ్గజం విప్రో ట్రంప్ ముప్పు గురించి బహిరంగంగా వెల్లడించింది. ట్రంప్ వల్ల తమకు చాలా నష్టం వాటిల్లబోతోందంటూ తెలిపింది. ఇన్ని సంవత్సరాల్లో తొలిసారి ఓ అమెరికా అధ్యక్షుడి వల్ల తాను ముప్పును ఎదుర్కోబోతున్నామంటూ, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు అందజేసిన వార్షిక ఫ్లైలింగ్ లో వెల్లడించింది. ట్రంప్ ఎన్నిక తమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పేర్కొంది. భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు, ఉగ్రవాదులు కూడా తమ రెవెన్యూలు, లాభాలపై ప్రభావం చూపుతాయని తెలిపింది. ట్రంప్ ను అనుసరిస్తూ యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్లు తీసుకున్న నిర్ణయాలు కూడా తమకు ముప్పుగా ఉన్నాయని పేర్కొంది.













