నాటా సాహిత్య పోటీల్లో విజేతలు వీరే…
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి విశేషంగా సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) వివిధ కార్యక్రమాలతోపాటు అనేక పోటీలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాటా 2020 సాహిత్య పోటీలు నిర్వహించింది. పోటీల్లో గెలుపొందిన వారి పేర్లను తాజాగా ప్రకటించింది. నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గోసల, నాటా సెక్రటరీ ఆళ్ల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింద్యిక్రమంలో ముఖ్య అతిథిగా నరాల రామారెడ్డి సుప్రసిద్ధ కవులు, రచయితలైన డాక్టర్ అఫ్సర్, కల్పనా రెంటాల, వేంపల్లే షరీప్, వేంకట క్రిష్ణ, నారాయణస్వామి వేంకటయోగి, డాక్టర్ విజయకుమార్ రెడ్డి, పోటీల్లో గెలుపొందిన విజేతలు జామ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారని నిర్వాహకులు చెప్పారు. నాటా సాహిత్య కమిటీ అధ్యక్షులు జయదేవ్ మెట్టుపల్లి, ఉపాధ్యక్షులు ప్రకాష్ తిమ్మాపురం మరియు సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని నాటా ప్రతినిధులు తెలిపారు.
విభాగాల వారీగా విజేతల పేర్లు..
కథ:
పోలేరమ్మ-డాక్టర్ ఎమ్. సుగుణ రావు
కడుపుకొట్టిన కరోనా – ఎండపల్లి భారతి
రేవడి – స్.బి.శంకర్
అహం ప్రేమాస్మీ – వసుందర
క్షమించండి – సుంకోజి దేవేంద్రాచారి
కవిత్వం:
బహుముఖ పయనం – స్వర్ణ శైలజ దంత
లోపలేదో కదులుతున్నట్టు – పలమనేరు బాలాజి
పెగలని మాట – దేశరాజు
నా మాట విను – కిరణ్ విభావరి
నాన్న పడక కుర్చీ – డి. నాగజ్యోతిశేఖర్
కార్టూన్ విభాగం:
కార్టూన్1: వేణు గోపాల రాజు ఎ.డి.వి.
కార్టూన్2: డాక్టర్ గురునాథ్ సిద్ద
కార్టూన్3: జగన్నాథం రామ మోహన్
కార్టూన్4: భాను (జి. భాస్కరరావు)
కార్టూన్5: జయకర్ బాబు కోపల్లి













