నిక్కీ హేలీ స్థానంలో ఇవాంక ట్రంప్ ?
ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి రాజీనామా చేసిన నిక్కీ హేలీ స్థానంలో నియమించడానికి తన కూతురు ఇవాంక ట్రంప్ గొప్ప ఛాయిస్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే బంధుప్రీతితో పదవి ఇచ్చానని ఫిర్యాదులు లేకపోతే, ఇవాంక ఆ పదవికి చక్కగా సరిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవాంక చాలా డైనమైట్. ఇందులో బంధుప్రీతి ఏమి లేదు. నేను ఇవాంక సామర్థ్యం గురించి ప్రజలకు తెలియజేయాలనుకున్నా. కానీ మీకు తెలుసు, నేను బంధుప్రీతితో చేస్తున్నానని అంతా ఆరోపిస్తారు అని ట్రంప్ శ్వేతసౌధంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. నిక్కీ హేలీ తన పదవికీ రాజీనామా చేసిన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.













