అరెస్టయిన విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం : హర్షవర్ధన్
పే అండ్ స్టే వీసా దుర్వినియోగం కేసులో అరెస్టయిన భారత విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నట్లు అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టయిన వారిని కలిసేందుకు అధికారులను పంపినట్లు తెలిపారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నేడు వారందరినీ కలిసి న్యాయసహాయం అందిస్తామని సృష్టం చేశారు. ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం వ్యవహారంలో ఇంతమంది విద్యార్థులు ఇరుక్కోవడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చెందుతోందన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడానాకి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిర్బంధంలో ఉన్నవారిలో కొందరిని ఇప్పటికే కలిశామని, మిగిలిన వారిని కూడా కలుస్తామని వెల్లడించారు. నిర్భందంలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన వివరాలు, సందేహాలు నివృత్తి కోసం ఏర్పాటు చేసిన 24 గంటల హాట్‌లైన్‌కు ఇప్పటి వరకు 100కు పైగా కాల్స్ వచ్చాయని హర్షవర్ధన్ పేర్కొన్నారు.













