ఒకవేళ నేను వస్తే జరిగేది మూడో ప్రపంచయుద్ధమే!
తాను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్దం వస్తుంది. రాజకీయాలు తనకు సరిపడవంటున్నారు పెప్సీకో మాజీ సీఈవో ఇంద్ర నూయి. ప్రతిష్టత్మక ఏషియా సోసైటీ ఫౌండేషన్ అందించే గేమ్ చేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న సందర్భంగా ఇంద్ర నూయి పలు విషాయాల గురించి మాట్లాడారు. ట్రంప్ క్యాబినేట్ లో మీరు జాయిన్ అవ్వొచ్చు కాదా అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె నాకు రాజకీయాలు సరిపోవు. నాకు సరిగా మాట్లడటమే రాదు. ఇంక లౌక్యంగా ఎలా మాట్లాడగలను. ఒకవేళ నేను గనక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుందని అంటూ ఇంద్ర నూయి చమత్కరించారు. పెప్సీకో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఈ నెల 3న ఇంద్ర నూయి ప్రకటించారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ దాదాపు 40 ఏళ్లుగా నా రోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యేది. రోజుకు దాదాపు 18-20 గంటలు పనిచేసే దాన్ని. కానీ ఇప్పుడు నాకు విశ్రాంతి దొరికింది. ఇప్పుడు నేను రోజుకు కనీసం 6 గంటలు ఏకధాటిగా నిద్రపోవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవాలి. వీలైనన్ని దేశాలు చుట్టి రావాలి అంటూ చెప్పుకొచ్చారు.













