రెండు కంటే ఎక్కువ గుడ్లు తింటే గుండెకు ప్రమాదం!
రోజు రెండు కంటే ఎక్కువ కోడిగుడ్లు తింటే గుండెకు ముప్పని తాజా సర్వే హెచ్చరిస్తోంది. అమెరికా వ్యవసాయశాఖ వెల్లడించిన ఈ వివరాలను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించారు. 31ఏళ్లుగా దాదాపు 30 వేల మంది తీసుకుంటున్న ఆహారం, వారి జీవన విధానంపై పరిశోధన చేసినట్లు తెలిపారు. కోడిగుడ్లలో కొవ్వు ఉంటుందని, దీనిని రోజూ అతిగా తీసుకుంటే చేటు చేస్తుందని మస్సాచుసెట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేథరినా టక్కర్ పేర్కొన్నారు. ఒక్కో గుడ్డులో 200 మిల్లీగ్రాముల కొవ్వు ఉంటుందని, ఇది రోజుకు 300 మిల్లీగ్రామలు దాటితే గుండెజబ్బులు రావడానికి 17శాతం ఆస్కారం ఉందని, చనిపోయేందుకు కూడా 18శాతం అవకాశం ఉందని వెల్లడించారు.













