నిన్న సచిన్… నేడు కోహ్లీ : సత్య నాదెళ్ల
క్రికెట్ అంటే సగటు భారత అభిమానిలాగే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల తన ఇష్టాన్ని చాటుకున్నాడు. అయితే క్రికెటర్ల అందరిలో ఎవరు ఇష్టమనే విషయంలో మాత్రం సత్య ఒకింత తడపబడ్డాడనే చెప్పాలి. ఢిల్లీలో జరిగిన యంగ్ ఇన్నోవేటర్స్ సమ్మిట్లో సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఇండియా ఆధ్యక్షుడు అనంత్ మహేశ్వరి అడిగిన ప్రశ్నకు ఆసక్తిగా బదులిచ్చాడు. సచిన్, కోహ్లీలో ఎవరు ఇష్టమన్న ప్రశ్నకు సత్య స్పందిస్తూ మతాన్ని ఎంచుకోవడం లాగా ఉంది. నిన్న సచిన్ ఇష్టమైతే, నేడు కోహ్లీ అని సమాధానమిచ్చాడు.













