కోవిడ్ 19 వైరస్ చికిత్సకు గ్లోబల్ మెగా ట్రయల్‌ను ప్రారంభించిన డబ్ల్యుహెచ్ఓ
కోవిడ్ 19 వైరస్ చికిత్సకు సంబంధించి గ్లోబల్ మెగా ట్రయల్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్ఓ) ప్రారంభించింది. హెచ్ఐవి మందులను ఉపయోగించడం ద్వారా కరోనా వైరస్‌ను అరికట్టవచ్చా లేదా అన్న విషయాన్ని పరిశీలించనున్నది. మలేరయా నివారణ ఔషధం, ఎబోలాకు వ్యతిరేకంగా ఉపయోగించిన ఔషధాలతో ఈ కరోనా వ్యాధిని అరికట్టవచ్చా లేదా అన్నది చూస్తోంది. ఈ మందులను ఉపయోగించడం ద్వారా కరోనా పేషంట్‌ను బతికించవచ్చా అన్న విషయాన్ని పరిశీలించాల్సిందిగా డాక్టర్లను, ఆస్పత్రులను కోరింది. పరిశోధకులు, పబ్లిక్ హెల్త్ ఏజెన్సీస్ ఈ విషయంలో ముందుకు రావాలని కోరింది. కోవిడ్ 19 పేషంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యుహెచ్ఓ ఈ విషయంలో వేగంగా స్పందించి వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది.













