కరోనా కట్టడికి మరో రెండేళ్లు:డబ్ల్యు హెచ్ ఒ అంచనా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి మరో రెండేళ్లు పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా అంచనా వేసింది. ప్రపంచం వ్యాక్సిన్ కనుగొనడంలో ఐక్యంగా విజయవంతం అయితే గత 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ నిర్మూలనకు పట్టిన వ్యవధి కన్నా కాస్త ముందస్తుగానే దీన్ని అదుపులోకి తేవచ్చునని డబ్ల్యు హెచ్ ఒ ఛీఫ్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయెసస్ శుక్రవారం ఆశాభావం వ్యక్తం చేశారు. స్పానిష్ ఫ్లూ ని పూర్తిగా నియంత్రించేందుకు రెండేళ్లు పట్టిందని, అయితే ప్రస్తుతం నాటి కంటే నేడు కనెక్టివిటీ కూడా ఉండడం వల్ల చాలా వేగంగా ఈ అంటువ్యాధి విస్తరించడానికి అవకాశం లభించిందని జెనీవాలో మాట్లాడుతూ అన్నారాయన. అయితే ప్రస్తుతం అప్పటికన్నా కరోనా ని నిర్మూలించడానికి అధిక సాంకేతిక పరిజ్ఞానం, నాలెడ్జ్ ఉన్నాయని గుర్తు చేశారు. మనకు గ్లోబలైజేషన్, కనెక్టివ్నెస్, క్లోజ్నెస్ వంటి అవరోధాలు ఉన్నప్పటికీ అత్యాధునిక టెక్నాలజీ ప్రయోజనం ఉందని కాబట్టి రెండేళ్లలోనే దీన్ని అదుపు చేయగలమన్నారు.













