వైట్ మీట్ తోనూ ముప్పే!
ఆవు, పంది, మేక మాంసమే (రెడ్ మీట్) కాదు.. కోడీ, కుందేలు, దూడ తదితర జీవాల మాంసంతో (వైట్ మీట్) కూడా ఆరోగ్యానికి చేటు తెస్తుందని తాజా సర్వే పేర్కొంది. ఒక్క రెడ్ మీట్ వల్లే శరీరంలో కొవ్వు స్థాయిలు ప్రభావితం అవుతాయని గతంలో వచ్చిన అధ్యయనాలను ఈ సర్వేలో కొట్టిపారేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు చేపట్టిన ఈ సర్వే వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించారు. దీనిని శాస్త్రీయంగా నిరూపించేందుకు కొందరిని ఎంపిక చేసి వారికి కొన్ని వారాలపాటు రెడ్ మీట్, వైట్ మీట్, పోషకాలతో కూడిన కూరగాయల ఆహారం ఇచ్చారు. పరీక్షకు ముందు, తర్వాత రక్తం పరీక్షలు చేశారు. మాంసాహారం తిన్న వారి కంటే కూరగాయలు ఆరగించిన వారు ఆరోగ్యంగా ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు.













