అమెరికాలో భారత వృత్తి నిపుణులకు మరో ఎదురుదెబ్బ!
అమెరికాలో పనిచేసే భారత వృత్తి నిపుణులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగులనున్నది. హెచ్-1బీ వీసాదారుల జీవిత బాగస్వాములకు పని అనుమతిని తొలిగించేందుకు ప్రస్తుతమున్న నిబంధనల్లో మార్పులు చేస్తూ రూపొందించిన ప్రతిపాదనలు అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు అందాయి. 90 వేల మందికిపైగా హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు, ప్రధానంగా భారతీయులకు నష్టం వాటిల్లే ఈ ప్రతిపాదనలను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వైట్‌హౌస్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఆఫీస్‌కు పంపినట్టు అధికారులు వెల్లడించారు. వైట్‌హౌస్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ నిర్ణయం అమలు ఇప్పుడే జరుగదని, కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు.













