రష్యా జోకం నిజమే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ విషయంలో యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ మధ్య భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం ముగిసిన అనంతరం ట్రంప్ మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో రష్యాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోకం చేసుకోలేదని అన్నారు.
తాజాగా, 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని వెల్లడించారు. అమెరికా నిఘా వర్గాలపై తనకు ప్రగాఢ విశ్వాసం ఉందంటూ ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. ఒకే అంశంపై రెండు రోజుల్లో రెండు వేర్వేరు ప్రకటనలతో ఓ పక్క అధికారులను మరో పక్క దేశ ప్రజలను తికమక పెట్టారు. వైట్‌హౌస్ పోస్ట్ చేసిన మీడియా సమావేశం ప్రతిని తాము చూశానని, దానిపై సృష్టత ఇవ్వాల్సి అవసరం ఉందని ట్రంప్ అన్నారు. మీడియాతో మాట్లాడుతున్నపుడు ఎన్నికల్లో రష్యా జోక్యం ఎందుకు ఉండకూడదు? అనబోయి, ఎందుకుంటుంది? అన్నాను. దీంతో అర్థం పూర్తిగా మారిపోయింది అని అన్నారు. ఎన్నికల్లో రష్యా జోక్యం గురించి నిఘా వర్గాల సమాచారంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇందులో రష్యాతో పాటు ఇతర ప్రమేయం కూడా ఉండొచ్చు. కానీ వారి ప్రభావం ఎన్నికలపై పడలేదని అని ట్రంప్ అన్నారు.













