వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్….
U.S. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్…గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.ఓవైపు భారతీయ మూలాల్ని ప్రస్తావిస్తు.. ఎన్ఆర్ఐల ఓట్లకు గాలమేసిన కమలా హ్యారిస్.. రీసెంట్ గా నల్లజాతీయ మహిళగా వారిని ఆకట్టుకునేందుకుప్రయత్నిస్తున్నారు. అయితే కమలాకు ముఖ్యంగా ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే.. తెల్లజాతీయుల ఓట్లను సాధించడం. ఎందుకంటే వారిలో అధికులు.. ట్రంప్ కు మద్దతుదారులుగా ఉండడం. అయితే ఇటీవల ఆన్ లైన్ వేదికగా వారిని తమవైపు తిప్పుకునేందుకు కమల అండ్ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగా జూలై 29 రాత్రి కమలా హారిస్‌కు ఓటు వేయాలని తెల్లజాతి పురుషులను కోరుతూ…స్టార్-స్టడెడ్ లైవ్ వీడియో కాల్ ద్వారా సుమారు $4 మిలియన్లు సేకరించారు, ఇందులో 'స్టార్ వార్స్' నటుడు మార్క్ హామిల్ , గాయకుడు జోష్ గ్రోబన్తో సహా లక్షా 90 వేల మంది ఇందులో యాక్టివ్ పాల్గొన్నారు.ఇందులో మహిళల హక్కులపై చర్చించారు.అయి ఈకాల్ లో 2 లక్షల మందికన్నా ఎక్కువ వైట్ ఉమెన్ హాజరయ్యారు.మొత్తంగా $11 మిలియన్లకు పైగా సేకరించారు.
రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న హారిస్‌ను .. ఎందుకు శ్వేతజాతీయులు ఎన్నుకోవాలి, ఆమె ఎన్నికకు ఎలా సాయం చేయాలి అనే అంశంపై మూడు గంటల పాటు "వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్" ప్రోగ్రామ్ జరిగింది. 2016 మరియు 2020 ఎన్నికల్లో 60% పైగా US శ్వేతజాతీయుల ఓట్లను గెలుచుకున్నారని "రన్ ఫర్ సమ్‌థింగ్" వ్యవస్థాపకుడు, ఆర్గనైజర్ రాస్ మోరేల్స్ రాకెట్టో చెప్పారు.హారిస్ గెలుపు కోసం చేసిన వీడియో కాల్ సిరీస్ లో ఈ కాల్ చాలా పెద్దది, మిలియన్ల మందిని ఆకర్షించిదని ఆమె ప్రచారబృందం తెలిపింది..
ఎన్నికల్లో హారిస్ మరియు డెమొక్రాట్లకు కీలకమైన ప్రచార అంశం.. మహిళల పునరుత్పత్తికి మద్దతివ్వ్వడం. దీని ద్వారా వైట్ ఉమెన్ ప్రయోజనం పొందుతారని వక్తలు తెలిపారు..లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ మరియు చిత్రనిర్మాత J.J. అబ్రమ్స్ ప్రతి ఒక్కరూ కాల్ సమయంలో సేకరించిన విరాళాల గురించి వివరించారు.నల్లజాతి మహిళా మద్దతుదారుల కోసం 40,000 మందికి పైగా ప్రజలు గతంలో ఒక కాల్లో చేరారు. నల్లజాతి పురుషుల కోసం చేసిన కాల్ .. 50,000 మందిని ఆకర్షించింది మరియు దక్షిణాసియా మహిళలు మరియు LGBTQ మిత్రదేశాల కోసం వేర్వేరు కాల్స్ తో ఈవెంట్స్ ఏర్పాటు చేశారు.







