డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేందుకు ఆధారాలున్నాయని ఒక రహస్య విజిల్ బ్లోయర్ చేసిన ఫిర్యాదు వెల్లడించింది. వచ్చే సంవత్సరం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరో దేశం జోక్యాన్ని ట్రంప్ కోరారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తొక్కిపట్టేందుకు వైట్‌హౌస్ ప్రయత్నించిందని వెలుగలోకి వచ్చిన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరపున తన ప్రత్యర్థి కానున్న జో బిడెన్, ఆయన కుమారుడు హంటర్ బిడెన్ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వలొదిమిర్ జెలెన్స్కీపై ట్రంప్ ఒత్తిడి తీసుకువచ్చిన వివరాలను ఆ ఫిర్యాదులో పొందుపర్చారు.













