అమెరికాలో ఉద్యోగమా… మాకొద్దు!
అమెరికాలో చిన్న ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అవుతుందనుకునే భారతీయులు చాలా మంది ఉన్నారు. ఇందు కోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇక్కడ అప్పులు చేసి మరీ అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేయాలని భావిస్తుంటారు. ముందుగా అమెరికా గడ్డపై కాలుపెడితే ఏ హోటల్లోనో, పెట్రోల్ బంక్లోనో పని చేసుకుంటూ ఆ తరువాత చిన్న టెక్ కంపెనీల్లో ఉద్యోగం సంపాధించొచ్చు అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ ఇంజినీరింగ్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వెంటనే అమెరికా లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇందతా ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారాయి.
అమెరికాలో ఉద్యోగం అంటే ఒకప్పుడో అదో క్రేజ్.. కానీ తాజా రిపోర్టు పలు సంచలన విషయాలు బయపెట్టింది. అమెరికాలో డ్రీమ్జాబ్ సంపాధించాలంటే ఒకప్పుడే అనేక కష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చేది. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అక్కడ ఉద్యోగం చేయాలన్న ఒకే ఒక కోరికతో అప్పటి యువత అడుగులు ముందుకేసింది. ఒక అమెరికాలో ఉద్యోగం చేయాలన్న విదేశీయుల సంఖ్య బాగానే పెరిగినప్పటికీ భారతీయుల్లో మాత్రం అమెరికా ఉద్యోగాలు వద్దు అనే అభిప్రాయం నెలకొన్నట్టు ఓ ప్రముఖ సర్వే ద్వారా వెల్లడైంది. దీనికి కారణం వీసాల జారీతో పాటు ఉద్యోగాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నట్టు తెలుస్తోంది.













