టీవీ ప్రియులకు పెనుముప్పు
గంటల తరబడి కూర్చొని టీవీ చూస్తున్నారా? కంప్యూటర్‌పై పని చేస్తున్నారా? అయితే, రక్త సరఫరా మందగించి సిరల్లో నెత్తురు గడ్డకట్టుకుపోయే (వీటీఈ) ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాళ్లకు, పాదాలకు రక్త సరఫరా మెరుగ్గా జరగక మోకాళ్ల వద్ద, నడుము భాగంలో రక్తం గడ్డకడుతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా పరిశోధకులు తెలిపారు. 45-64 మధ్య వయసున్న 15వేల మందిని పరీక్షించగా టీవీకి అతుక్కుపోయే వారిలో వీటీఈ సమస్య 1.7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిందని వివరించారు. రక్తం గడ్డ కట్టకుండా ఇంటోన్లే కొన్ని ఆయుర్వేద పద్ధతులు వాడొచ్చు. పరిస్థితి అదపు తప్పుతుందని తెలిస్తే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.













