వాటా బతుకమ్మ వేడుకలు
వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహించారు. వర్చువల్ పద్ధతిలో బ్యాక్యార్డ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎంతోమంది మహిళలు పాల్గొని సంప్రదాయబద్దంగా బతుకమ్మ వేడుకలను చేశారు. కోవిడ్ 19 జాగ్రత్తలు తీసుకుని ఎవరికివారు సంప్రదాయంగా వేడుకలను తమతమ ఆవరణలో వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా గౌరీపూజను కూడా చేశారు. బతుకమ్మ పాటలను పాడారు. వాషింగ్టన్ తెలుగు సమితి (వాట్స్), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) సహకారంతో వాట్స్ ఈ వేడుకలను వైభవంగా జరిపింది. భారతి, మానస, అనూరాధ, దీపిక, షబనా, శ్వేత, లక్ష్మీ, రమతోపాటు టీన్ వలంటీర్లు మన్స్వీ, సుహ, సాయి కె, అర్జున్ టీ తదితరులు ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు. శాన్ఫ్రాన్సిస్కో కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా నాగేంద్ర ప్రసాద్ బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని వాటా సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. నవీన్, రవీందర్, వివేక్, చంద్రసేన, రవి సాధు, చైతన్య వేడుకలను వైభవంగా జరపడానికి సహకరించారు.













