కరోనాకు స్పీడ్ బ్రేకర్లుగా నిలుస్తున్న ఎండ వాతావరణం
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా స్పీడ్ బ్రేకర్లుగా వేడి వాతావరణం అడ్డుకుంటోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్కువ వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే చోట కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నెమ్మదిగా ఉంటుందని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్-19 సోకినవారి సంఖ్యను.. ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, గాలిలో తేమ (ఆర్ద్రత) ఎంత మేరకు ఉన్నాయనే అంశంతో ఎంఐటీ పరిశోధకులు పోల్చిచూశారు. వారి అధ్యయనం ప్రకారం.. 3 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోనే్న దాకా కొవిడ్-19 వ్యాప్తి జరిగినట్టు తేలింది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడమే కాదు.. ఆయా ప్రాంతాల్లో గాలిలో తేమ కూడా క్యూబిక్ మీటరుకు 4-9 గ్రాములుగా ఉన్నట్టు వెల్లడైంది.
అదే సమయంలో.. సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు మించి ఉండి, జనవరి, ఫిబ్రవరి నెలల్లో, మార్చి మొదటివారంలో ఆర్ద్రత ఘనపు మీటరుకు 9 గ్రాముల కన్నా ఎక్కువగా ఉన్న చోట్ల కరోనా ఇన్ఫెక్షన్లు కేవలం 6 శాతం నమోదయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో.. రుతుపవనాలు ఉండే ఆసియాన్ దేశాల్లో గాలిలో తేమ ఘనపు మీటరుకు 10 గ్రాముల కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని వారు విశ్లేషించారు.
అమెరికాలో వేడిగా ఉండే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే చల్లగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. ఉదాహరణకు.. టెక్సాస్, న్యూమెక్సికో, అరిజోనా రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాల మధ్యలో ఉన్నప్పటికీ.. ఆరెగావ్ రాష్ట్రంలో 200 కన్నా తక్కువ కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమో కావడం విశేషం. ఆసియా, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలు చైనా, అమెరికా, యూరప్ దేశాల్లోలాగా కఠినమైన క్వారంటైన్ ప్రమాణాలను పాటించకపోయినప్పటికీ.. అక్కడి వాతావరణ పరిస్థితుల వల్లే వైరస్ సగటు వ•ద్ధిరేటు తక్కువగా ఉందని ఎంఐటీ పరిశోధకులు విశ్లేషించారు.













