అమెరికాలో వింత సంఘటన…
అమెరికాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఏటీఎం వద్దకు వెళ్లిన వారిపై దాడి చేస్తున్న ఓ కోడిపై స్థానికులు వాల్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోడి కోసం పోలీసులు శోధింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కోడి ఆచూకి తెలపాలంటూ వాల్కర్ పోలీసులు ఫేస్బుక్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాస్క్‌తో ఉన్న కోడి ఫోటోను పోస్టు చేస్తూ, గత కొద్ది రోజులుగా ఈ కోడి లూసియాన బ్యాంక్ ఏటీఎం వద్దకు వచ్చిపోయే వారిపై దాడి చేస్తూ కలకలం సృష్టిస్తోంది. అంతేగాక రోడ్డుపై సంచరిస్తూ వచ్చిపోయే కార్ల మీదకు ఎగురుతూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కోడిపై దర్యాప్తు చర్యలు చేపట్టాము. ఇక సదరు కోడి జాడ తెలిసిన వారు వెంటనే మాకు సమాచారం అందించండి అంటూ పోస్టులో రాసుకుచ్చారు.













