మంచినీళ్లు ఆర్డర్ చేసి 7 లక్షల టిప్ ఇచ్చాడు
ఓ వ్యక్తి రెస్టారెంట్‌కు వచ్చాడు. ముందుగా రెండు గ్లాసుల నీళ్లు ఆర్డర్ చేశాడు. ఆ టేబుల్ వెయిటర్ అలైనా కస్టర్ రెండు గ్లాసుల్లో నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆ తర్వాత వెయిటర్ కస్టర్ మళ్లీ లోపలకి వెళ్లింది. మెనూ చూస్తు ఆ కస్టమర్ రెండు బుక్కల నీళ్లు తాగాడు. పుడ్ ఆర్డర్ తీసుకునేందుకు ఆమె మళ్లీ టేబుల్ దగ్గరకు తిరిగి వచ్చింది. వచ్చి చూసేసరికి ఆ టేబుల్ మీద వంద డాలర్ల నోట్లు కొన్ని కనిపించాయి. ఆ నోట్లను చూసి కస్టర్ స్టన్ అయ్యింది. వాటిని లెక్కపెట్టింది. అవి పదివేల డాలర్లు (సుమారు ఏడున్నర లక్షలు) ఉన్నట్లు ఆమెకు తెలిసిపోయింది. ఆ టేబుల్ మీదే ఉన్న ఓ న్యాప్కిన్పై అతను ఇలా రాసి వెళ్లాడు. రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఆ న్యాప్కిన్ పై రాశాడు.
వెయిటర్ కస్టర్ అది చదివి షాకైంది. తనకు పదివేల డాలర్లు టిప్ ఇచ్చారా అంటూ ఆమె ఆశ్చర్యపోయింది. మొదట నమ్మలేకపోయింది. కానీ నిజంగానే ఆ టేబుల్ మీద కుర్చున్న కస్టమర్ ఆ టిప్ ఇచ్చినట్లు తెలుసుకుంది. ఆ కస్టమర్ ఓ యూట్యూబ్ స్టార్. అతని పేరు మిస్టర్‌బీస్ట్. అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. అతనికి 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అప్పుడప్పుడు అతను గుర్తు తెలియని వ్యక్తులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తుంటాడు. తాజాగా వెయిటర్ కస్టర్‌ను కూడా అతను తన టిప్‌తో థ్రిల్ చేశాడు. అయితే కస్టర్ తనకు వచ్చిన టిప్‌ను చూసి స్టన్ అయిన సందర్భాన్ని అతని టీమ్ వీడియో తీసింది. ఇలాంటి వీడియోలు అతని యూట్యూబ్‌లో పేజీలో బోలెడున్నాయి. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఉన్న గ్రీన్విల్లే సుప్ డాగ్స్ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది.













