ప్రేమికుల దినోత్సవ ఆఫర్ ప్రకటించిన విస్తారా
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విస్తారా ఎయిర్ లైన్స్ భారీ రాయితీలు (గరిష్ఠంగా 80 శాతం) ప్రకటించింది. ఎకానమీ క్లాస్ టిక్కెట్లను రూ.899, ప్రీమియం ఎకానమీ రూ.1,499, బిజినెస్ క్లాస్ టిక్కెట్లను రూ.5,499కే (అన్ని పన్నులతో కలిపి) అందిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండ్రోజుల ఆఫర్ నేడు ప్రారంభమై 13వ తేదీ (బుధవారం అర్థరాత్రి) ముగియనుంది. ఈ పథకంలో భాగంగా కొనుగోలు చేసిన టిక్కెట్లతో ఫిబ్రవరి 27 నుంచి సెప్టెంబరు 18లోగా ప్రయాణించేందుకు వీలుంటుంది. ఎకానమీ, ప్రీమియం ఎకామనీ క్లాస్ టిక్కెట్లను కనీసం 15 రోజులు, బిజినెస్ క్లాస్ టిక్కెట్లను వారం ముందు బుక్ చేసుకోవాలి.













