విశ్వర్షి వాసిలి “నేను” ఆవిష్కరణ సభ
సిరికోనలో ఏడాదిపాటు ప్రతీవారం ధారావాహికంగా ఆదరాభిమానాలను అందుకున్న విశ్వర్షి వాసిలి “నేను” యౌగికకావ్యానికి సిరికోన సంచాలకులు, ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ‘ఇదో యౌగిక అనుభావ్యం’ “తెలుగు సాహిత్యంలో “నేను” తొలి యౌగిక కావ్యం” అంటూ తమ అపూర్వ ముందుమాటతో “నేను”కు తెలుగు సాహిత్యంలో ఒక అద్వితీయ స్థానాన్ని కల్పించారు.
••• సినీగేయకవి శ్రీ భువనచంద్రగారు తమ ‘అనంతావలోకనం’తో “నేను”ను అనంతసంగ్రహం అంటూ అక్షరబద్ధం చేశారు.
••• ఆచార్య రాణి సదాశివమూర్తిగారు ‘విశ్వర్షి ‘నేను’పై నానుడి’ అంటూ “నేను”లోని ‘రాజయోగ రస సిద్ధిని’ 14 పద్యాలలో చూపారు.
••• డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ‘అచ్చమైన ఆకసమున విచ్చుకొన్నట్టి ఈ ‘నేను’ను మెచ్చు’ కుంటూ పద్యాల రూపంలో అభినందించారు.
••• డా. రాజేశ్వరి దివాకర్లగారు ‘ఆత్మయాన అక్షరాలు, మంత్రరహస్య మాటలు, విశ్వదర్శన వాక్యాలు’ అంటూ ప్రతి వాక్య తత్త్వాన్ని ‘అతీంద్రియ సౌందర్య సంస్కారంతో విరిసిన సహస్రదళ పద్మం’గా ఆవిష్కరించారు.
••• డా. రాయదుర్గం విజయలక్ష్మిగారు ‘ఏకతారాగంలో ఐక్యతారాగం’ అంటూ “నేను”ను ‘యౌగిక కోణాలనుండి మానవ పరిణతిని శోధించిన ‘కవితారాజ’”మంటూ అక్షరశోధన కావించారు.
••• కథకులు, నవలా రచయిత శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తిగారు “నేను”తో సహయానం చేస్తూ ‘అంతర్లోకాల ఉషస్సుల గురించీ, బహిర్లోకాల యశస్సుల గురించీ ఇంత లోతైన దృష్టి చాలా అరుదు’ అంటూ అపూర్వరీతిన సమీక్షించారు.
••• తొమ్మిది పదుల ‘కవేరా’
(శ్రీ కణుగుల వేంకటరావు) గారు ‘విశ్వర్షి వాసిలివారు వ్రాసినవి చదువుతూ అర్థం చేసుకోవడానికి నిత్యమూ ప్రయత్నిస్తున్న విద్యార్థిని’ అంటూ ‘శుభాశీస్సుల’ నందించారు.
ఇలా సిరికోన సాహితీ మిత్రుల అద్వితీయ సమీక్షలతో పాటు విశ్వర్షి వాసిలి “నేను” తెలుగు సాహిత్యంలో తొలి యౌగికకావ్యంగా యోగాలయ, సికింద్రాబాద్ లో 31 డిసెంబర్, 2019 నాడు జరిగిన ఆవిష్కరణ సభలో వక్తల ప్రశంసలందుకుంది.
Release photo : Dr. Gali Rajeswari (Bellary), Sri Jonnavitthula Sreeramachandra Murty (MAA TV, Hyderabad), Ex Vice Chancellor of Dravidian University Prof. Gangisetti Lakshminarayana, Author Viswarshi Vaasili,Smt.. Mani Kumari (Secunderabad), Sri Diwakar (Visakhapatnam), Smt. Swarajya Bharathi (Tirupati) @ Book Release NENU Yougika Kaavyam by Viswarshi Vaasili @ Yogaalaya, Trimelgherry, Secunderabad on 31st December 2019.
For a Free copy (Residents of USA and Canada only) contact:
Dr. Ramana Vasili
Spiritual Foundation, Inc.
7062 South Beringer Drive
Cordova, TN 38018 (USA)
901-387-9646













