అమెరికాలో మళ్లీ అదే సీన్
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రో అమెరికన్ మరణానికి ఓ శ్వేత జాతీయుడైన పోలీసు కారకుడైన ఘటనపై అగ్రహ జ్వాలలు వ్యక్తమవుతూ నిరసనలు కళ్లెదుట కనిపిస్తున్న తరుణంలోనే దేశంలో మరోసారి ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వర్జీనియాలోని ఫెయిర్ఫాక్స్ కౌంటీలో నల్లజాతీయుడిపై ఓ పోలీసు అమానవీయంగా ప్రవర్తించిన తీరు విస్మయం కలిగిస్తోంది. నల్లజాతీయుడిపై వర్జీనియా పోలీసు తుపాకీ గురిపెట్టి అతడిని కిందపడేశారు. అనంతరం మెడపై మోకాలు పెట్టి హింసించాడు. జార్జ్ ఫ్లాయిడ్ మాదిరిగానే ఇతడు కూడా ఐ కాంట్ బ్రీత్ అంటూ అరిచాడు. అయినప్పటికీ పోలీసు అతడిని విడిచిపెట్టలేదు. చివరకు అతడు గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాలకు చిక్కాయి. దీంతో ఆ పోలీసుపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.













