డల్లాస్ లో అంగరంగ వైభవంగా విజయనగర ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థుల రీయూనియన్
విజయనగర ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థుల, అధ్యాపకుల సమావేశం కన్నుల పండుగగా ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. నాట్స్ లో అంతర్భాగం గా మూడురోజుల పాడు వేయి మందికి పైగా వి ఇ సి విద్యార్థులు సందడి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి వివిధ దేశాలలో స్థిరపడిన విద్యార్థులు మరియు వారికీ విద్యా బోధన చేసిన ఆధ్యాపకులు కుటుంబ సమేతంగా తెలుగుదనం ఉట్టి పడే వస్త్ర ధారణ చేసి మరింత శోభను తెచ్చారు.
వీఈసీ ఆధ్యాపకులు విద్యార్థులతో వారికీ వున్నా అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. విద్యార్థులు కూడా కాలేజీ రోజులలో జరిగిన విశేషాలను, అల్లరిని, ఆధాపకులకు పెట్టిన మారుపేట్ల గురించి వివరించి వినోదాన్ని పంచారు. కళాశాలలో స్వామి కాంటీన్, బస్సుదగ్గర, అమ్మాయిల హాస్టల్ దగ్గర చేసే కామెంట్స్ వాటికీ అమ్మాయిల రియాక్షన్ గురించి, ఒక్కొక్కరి కి వున్నా నిక్ నేమ్స్ గురించి గుర్తు చేసుకొని. ఆనంద బాష్పలతో మూడు రోజులు సరదాగా గడిపారు. ఈ కార్యక్రమానికి ఇండియా, కెనడా, దుబాయ్, సింగపూర్, బెహ్రాన్, మలేషియా, మరియు అమెరికాలో వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన విద్యార్థులు అధ్యాపకులు హాజరుయ్యారు.
ఆహూతులందరికి స్వామి కాంటీన్ లో దొరికే ఇడ్లి, చౌచౌ బాత్, బులెట్ పునుగులు, టమోటో బాత్, ఉప్మా, టీ, కాఫీ మరియు పలావ్, బిర్యానీ తదితర వంటకాల్ని చాట్అండ్ దోశ రెస్టారెంట్ వారు సమకూర్చారు.
ఈ కార్యక్రమం లో ప్రొఫెస్ర్స్ అందరినీ పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సత్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకొన్నారు. ప్రొఫెస్ర్స్ మాట్లాడుతూ ఇది వారిజీవితం లో మరచి పోలేని మధుర ఘట్టంగా నిలుస్తుందని అన్నారు. ఈకార్య క్రమానికి ఆహ్వానించి ఇంట ప్రేమ ఆప్యాయతలు చూపిన విద్యార్థులందరికీ పేరు పేరున ధన్య వాదాలు తెలిపారు.













