భయంతో ఉన్నవారు ఏపీఎన్ఆర్టీని సంప్రదిస్తే సహాయం
అమెరికాలో అక్రమంగా ఉంటున్నామని భావించే వారంతా తిరిగి వచ్చేయడమే మంచిదని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ సొసైటీ) అధ్యక్షుడు వేమూరి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో సీఈవో భవానీ శంకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ పిల్లలు పోను కూడా తీయటం లేదని ఏమైనా అరెస్టులు జరిగి ఉంటాయా? అని తల్లిదండ్రుల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. 52 మందిని అరెస్టు చేసి డిటెన్షన్ సెంటర్ (విచారణ కేంద్రం)లో ఉంచినట్లు సమాచారం వచ్చిందని, మిగిలిన వారు భయంతో ఫోన్లు నిలిపివేసి ఉండవచ్చుని చెప్పారు. భయంతో ఉన్నవారు ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్లను సంప్రదిస్తే సహాయం చేస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం 24 గంటల పాటు పనిచేసే హాట్టైన్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా టోల్‌ప్రీ నెంబర్ 8632340768లో సంప్రదించవచ్చని చెప్పారు.













