24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ)
www.vangurifoundation.blogspot.com
24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ఉత్తర అమెరికా & ఇతర విదేశాల తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 20, 2019)
గత 24 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “శ్రీ వికారి” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 6, 2019) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి.
ప్రధాన విభాగం – 24వ సారి నిర్వహణ
భారత దేశంలో తప్ప ఇతర దేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
“మొట్ట మొదటి రచనా విభాగం” –11వ సారి నిర్వహణ
కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 11వ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, భారత దేశం మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
“నా మొట్ట మొదటి కథ”: (ఉత్తమ కథ): $116
“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): $116
అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
- ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక రచన మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
- తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
- రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.
- బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ లోనూ, ఇతర పత్రికలలోనూఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
- విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు(ఏప్రిల్ 6, 2019) కాని, అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ పోటీకి పంపిన రచనలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
- విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries is: March 20, 2019
Please send entries by e-mail attachments only (PDF, JPEG or Unicode fonts)
sairacha@gmail.com & vangurifoundation@gmail.com
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్ & హైదరాబాద్
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com













