27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ: విజేతల ప్రకటన
“శుభకృతు” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 1, 2022) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా, అబు ధాభి. హాంగ్ కాంగ్, సింగపూర్, ఐర్లాండ్, భారత దేశాల నుంచి రచయితలు స్పందించడం చెప్పుకోదగ్గ విశేషం. “నా మొట్టమొదటి కథ, కవిత” విభాగాలకి ఈ సారి కలం పట్టిన ఔత్సాహిక విదేశీ రచయితలు అధిక సంఖ్య లో ఉన్నారు. అందు వలన ముందు ప్రకటించిన ఒక నగదు బహుమతికి అదనంగా మరొక సమాన బహుమతిని అందిస్తున్నాం. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ‘మధురవాణి’ లోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.
ప్రధాన విభాగం – 27వ సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“మరో కురుక్షేత్రం”– పాణిని జన్నాభట్ల (Boston, MA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ధారావాహిక హత్యలు” –నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్ (Tampa, FL) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“భూలోక స్వర్గం” – డా. కె. గీత (Morgan Hill. CA) ప్రశంసా పత్రం
“ఆట – పోరు”- తాడికొండ కె. శివకుమార శర్మ, (Greater Washington DC) ప్రశంసా పత్రం
ఉత్తమ కవిత విభాగం విజేతలు
“ఈ రాత్రికి సౌత్ ఆఫ్రికా” -గౌతమ్ లింగా (Johannesburg, South Africa) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఏమంటేనేం?”- స్వాతి శ్రీపాద (Detroit, MI) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఒంటరి సాయంత్రాలు”- రవి మంత్రిప్రగడ (Dublin, Ireland) ప్రశంసా పత్రం
“పువ్వు” – సతీష్ గొల్లపూడి (Auckland, New Zealand) (ప్రశంసా పత్రం)
“మొట్టమొదటి రచనా విభాగం” –14వ సారి పోటీ
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
“క్రైమ్ నెవెర్ పేస్” –V K V ప్రసాద్ (Hyderabad, India) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“రెండు నిమిషాలు- అమృత వర్షిణి (Lone Tree, CO, USA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఆడ పిల్ల”- షేక్ షబ్బర్ హుస్సేన్ (Kadapa, A.P, India) ప్రశంసా పత్రం
“నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
“భూమిని హత్తుకునే క్షణాలకోసం”- అసిఫా గోపాల్ (Nellore, A.P. India) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“తను వెళ్ళిపోయింది”- రాజు గడ్డం (Kavadi palli village, N, India) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“శిల-కల”- ఆవుల కార్తీక (Hyderabad, India) ప్రశంసా పత్రం
న్యాయ నిర్ణేతలకి అభివాదాలతో, పోటీలో పాల్గొన్న రచయితలకి ధన్యవాదాలతో, విజేతలకు అభినందనలతో,
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
భవదీయులు
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు)
Vanguri Foundation of America, Inc.
3906 Sweet Hollow Court, Sugar Land, TX. 77498
E-mail: vangurifoundation@gmail.com













