టిటిఎ అధ్యక్షుడిగా వంశీరెడ్డి బాధ్యతల స్వీకరణ
లాస్‌వెగాస్‌లో టీటీఏ బోర్డ్ సమావేశం
మొట్టమొదటి జాతీయ తెలంగాణ సంస్థ అయిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టిటిఎ) నూతన అధ్యక్షుడిగా వంశీరెడ్డి కంచరకంట్ల ఎన్నికయ్యారు. మహానగరం లాస్‌వెగాస్ వేదికగా జరిగిన టీటీఏ బోర్డ్ మీటింగ్ వేదికగా ఈ ఎన్నిక జరిగింది. ఆయనతో పాటు ఎన్నికైన 29 మంది బోర్డ్ సభ్యులతో అడ్వైజరీ చైర్ పర్సన్ డాక్టర్ హరనాథ్ రెడ్డి పోలిచెర్ల ప్రమాణ స్వీకారంచేయించారు. ఈ సందర్భంగా వంశీరెడ్డి మాట్లాడుతూ.. సంస్థను అభ్యున్నతి కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తానని, తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరి నమ్మకాన్ని నిలబెట్టేలా సేవ చేస్తానన్నారు. తనను నమ్మి ఇంతటి బాధ్యతను అప్పగించిన సంస్థ సభ్యులందరికీ ధన్యావాదాలు తెలిపారు.
సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి తొలి ప్రసంగంతో ఈ సమావేశం ప్రారంభమైంది. మల్లారెడ్డి మాట్లాడుతూ.. మునుపటి అధ్యక్షుడు డాక్టర్ మోహన్ రెడ్డిని ఎంతగానో ప్రశంసించారు. టీటీఏ అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని, ముఖ్యంగా న్యూజెర్సీలో జరిగిన టీటీఏ మెగా కన్వెన్షన్-2022ని అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. అనంతరం టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ విజయ్‌పాల్ రెడ్డి మాట్లాడుతూ.. టీటీఏ సంస్థ అద్భుతంగా పనిచేస్తోందని, సంస్థలోని ప్రతి ఒక్కరూ అందిస్తున్న సేవలకు ధన్యవాదాలని చెప్పుకొచ్చారు.
ఇక ఎన్నిక అనంతరం జరిగిన బోర్డ్ మీటింగ్‌లో యూఎస్ కాంగ్రెస్ నేత ఆర్ఓ ఖన్నా చేతుల మీదుగా యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డ్ ప్రదానోత్సవం జరిగింది. శ్రీనివాస్ మనాప్రగడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ హరనాథ్ పోలిచెర్ల, శ్రీనివాస్ మనాప్రగడ, డాక్టర్ విజయపాల రెడ్డి, మోహన్ రెడ్డి పాటలోళ్ల, భరత్ రెడ్డి మాదాది, రామ వనమ్లకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్‌తో ఖన్నా సత్కరించారు. అలాగే వంశీరెడ్డి కంచరకంట్లకు ప్రెసిడెంట్స్ గోల్డ్ అవార్డ్, సురేశ్ రెడ్డికి సిల్వర్ అవార్డ్, దివాకర్ జంధ్యంకు బ్రాంజ్ అవార్డ్ అందించి అభినందించారు.
కొత్త కార్యవర్గం
ప్రెసిడెంట్ – వంశీ రెడ్డి కంచరకుంట్ల
ఎలక్టెడ్ ప్రెసిడెంట్‌గా నవీన్ మల్లిపెద్ది
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ నరసింహా రెడ్డి దొంతిరెడ్డి
జనరల్ సెక్రటరీగా కవితా రెడ్డి
ట్రెజరర్‌గా సాహోధర్ పెద్దిరెడ్డి
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దివాకర్ జంధ్యం
జాయింట్ సెక్రటరీగా శివారెడ్డి కోళ్ల
జాయింట్ ట్రెజరర్‌గా మనోహర్ బొడ్కే
నేషన్ కోఆర్డినేటర్‌గా ప్రదీప్ మెట్టు
ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రసాద్ కునారుపు
మీడియా అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా నిషాంత్ సిరికొండ
మెంబర్షిప్ డైరెక్టర్‌గా అమిత్ రెడ్డి సూరకంటి
ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పవన్ రావ
సేవా డేస్ కోఆర్డినేటర్‌గా గంగాధర్ వూపళ్ల
విమెన్ కమిటీ అడ్వైజర్‌గా స్వాతి చెన్నూరి
ఎథిక్స్ కమిటీ కోఆర్డినేటర్‌గా గణేశ్ వీరమనేని తదితరులు ఎన్నికయ్యారు.
టిటిఎలో వంశీరెడ్డి
తెలంగాణ అమెరికా తెలుగు సంఘంలో వంశీరెడ్డి అంచెలంచెలుగా ఎదిగి నేడు ప్రెసిడెంట్ పదవిని చేపట్టారు. 2015-16లో రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా, 2017-18లో బోర్డ్ డైరెక్టర్‌గా, సేవా డేస్ కో ఆర్డినేటర్‌గా, 2019-20లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, 2021-22లో ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా బాధ్యతలను నిర్వహించారు. నేడు ప్రెసిడెంట్‌గా బాధ్యతలను చేపట్టారు.
తన హయాంలో టీటిఎ కమ్యూనిటీకి మరింత సన్నిహితం చేసేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వంశీరెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, కళలను విస్తరించడంతోపాటు, కళాకారులను, కవులను, రచయితలను తెలంగాణ భాషా వైభవాన్ని చాటి చెప్పే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.













