టిటిఎలో వంశీరెడ్డి పయనం…
తెలంగాణ అమెరికా తెలుగు సంఘంలో వంశీరెడ్డి అంచెలంచెలుగా ఎదిగి నేడు ప్రెసిడెంట్ పదవిని చేపట్టారు. 2015-16లో రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా, 2017-18లో బోర్డ్ డైరెక్టర్‌గా, సేవా డేస్ కో ఆర్డినేటర్‌గా, 2019-20లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, 2021-22లో ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా బాధ్యతలను నిర్వహించారు. నేడు ప్రెసిడెంట్‌గా బాధ్యతలను చేపట్టారు.
తన హయాంలో టీటిఎ కమ్యూనిటీకి మరింత సన్నిహితం చేసేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వంశీరెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, కళలను విస్తరించడంతోపాటు, కళాకారులను, కవులను, రచయితలను తెలంగాణ భాషా వైభవాన్ని చాటి చెప్పే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు, కమ్యూనిటీకి సహాయపడటంలో ముందుంటున్న వంశీరెడ్డికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం ఇచ్చే ప్రెసిడెంట్స్ గోల్డ్ అవార్డ్ లభించింది. ఇటీవల జరిగిన కార్యక్రమంలో యూఎస్ కాంగ్రెస్ నేత ఆర్ఓ ఖన్నా దీనిని ప్రదానం చేశారు.













