వారధి ఉగాది వేడుకలు ఏప్రిల్ 14న
తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలని ప్రోత్సహించటం ముఖ్య ఉద్దేశ్యం గా ఏర్పడ్డ వారధి సంస్థ, 5 వసంతాలు పూర్తి చేసుకుంటూ, మరో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ 2018 ఉగాది వేడుకలకు సన్నద్ధం అవుతోంది.
మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా, చిట్టిపొట్టి చిన్నారుల నృత్య రూపకం ఎంతో చక్కగా రూపు దిద్దుకొంటూ ఉంది. మనదైన భాషలో మన చరిత్ర పునాదిని ఈతరం పిల్లలు మనకందిస్తుంటే కలిగే గర్వమే వేరు కదా !
అదే కాకుండా మరెన్నో సరదా సందళ్ళతో, పసందైన విందుతో, హుషారైన వినోదం తో ఎంతో ఉత్సాహం గా తయారై, ఈ వేడుకల్ని మీముందుకు తీసుకురావడానికి విసుగు విరామం లేకుండా పని చేస్తున్నారు వారధి కార్య కర్తలు.
ఎన్నో ఏళ్ళుగా బతుకు పుస్తకంలో
ప్రతి పుటను ప్రకృతి పలకరిస్తుంది
ప్రతి అక్షరముతో కరచాలనము చేస్తుంది
ప్రతి మనిషికి పంచభూతాలనందిస్తుంది
కాలంతో కదులుతూ తన కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తిస్తుంది
మనిషిగా నీ దాతృత్వ గుణాన్ని నిర్వర్తించమంటుంది
అపుడే ధర్మం నాలుగు పాదాల నడిచే ఆలంబన కలుగుతుంది.
రండి కదిలి రండి కలసి రండి వారధి తలపెట్టిన
దాతృత్వపు విరాళాల సేకరణ వేడుకలో పాలుపంచుకొనండి..
ఆశా కిరణ్ మరియు శంకర ఐ ఫౌండేషన్ వారి ద్వారా
ఉన్నంతలో సాటి వారికోసం సాయం చేద్దాం
అనాధలను ఆదరిద్దాం..
అంధులను ఆదుకుందాం..
రేపటి ఆశకు చీకటి తెర తొలగిద్దాం
వారి తడి కన్నులలో ‘ఆశా కిరణా’ల వేకువ చూపెడదాం..
Eyes are soul’s portal to experience the light of world around us. Education takes a human into the enlightened world around us and gain experience required to live independently.
By contributing to Shankara Eye foundation and Asha kiran we are making a conscious effort to
Open an new threshold of opportunities for visually challenged and under privileged kids in our home land , the land where we came from.
Please join your hands with a high spirited team of Vaaradhi.To share your contributions contact treasurer@vaaradhi.org













