అమెరికాకు స్వీడన్ షాక్
డిఫెండింగ్ ఛాంపియన్, నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచిన అమెరికాకు స్వీడన్ షాకిచ్చింది. మహిళ ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో స్వీడన్ పెనాల్టీ షూటౌట్లో 5-4 తో ఓడించి క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లింది. అమెరికా-స్వీడన్ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయారు. దీంతో మ్యాచ్ పూర్తి సమయం ముగిసే సరికి ఇరు జట్ల నుంచి (0-0) ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ పెనాల్టీ షైటౌట్కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్లో స్వీడన్ 5 గోల్స్ సాధించగా, అమెరికా మాత్రం 4 గోల్స్ మాత్రమే చేసి టోర్నీ నుంచి వైదొలిగింది. ఇక క్వార్టర్ పోరులో స్పెయిన్‌తో స్వీడన్ జట్టు ఢీ కొననుంది. ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-0తో సౌతాఫ్రికాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్ పోరులో నెదర్లాండ్స్ జట్టు జపాన్‌తో అమితుమి తేల్చుకోనుంది.













