పాక్‌కు అమెరికా వార్నింగ్
ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, జమాతుద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను వెంటనే తిరిగి అరెస్టు చేయకుంటే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయని అమెరికా పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన సయీద్ తలపై 10 మిలియన్ అమెరికా డాలర్ల రివార్డు ఉంది. అయితే అతడు నిర్భందం నుంచి విడుదలయ్యాడు. మరేదైనా కేసులో అతడిని మళ్లీ అరెస్టు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సయీద్ జనవరి నుంచి నిర్బంధంలో ఉన్నాడు. గృహ నిర్బందం నుంచి లష్కరే తయిబా నాయకుడిని విడుదల చేయడంపట్ల వైట్ హౌస్ పత్రికా శాఖ మంత్రి సరా శాండర్స్ తన ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అతడిని తిరిగి అరెస్టు చేసి, విచారించాలని కూడా కోరారు. సయీద్‌ను విడుదల చేసి తప్పుడు సందేశాన్ని ఇచ్చినట్లుయిందని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరుకు పాకిస్థాన్ వైఖరి భిన్నంగా ఉందని సృష్టమవుతోంది.













