ఆ సంస్థే మరోసారి దాడి చేసే అవకాశం : అమెరికా
శ్రీలంకలో మరో ఉగ్రదాడికి మిలిటెంట్లు కుట్ర పన్నారని అమెరికా నిఘా వర్గాలు హెచచరించాయి. దేశ వ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. ఈస్టర్ రోజున తెగబడిన ఉగ్రవాద సంస్థే మరోసారి దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. పర్యాటక ప్రాంతాలు, రవాణా ప్రాంతాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పార్కులు, ఆలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలు, ఇతర ప్రజావేదికల్లో పటిష్ట భద్రత ఏర్పాట చేయాలని యూఎస్ తన లేఖలో పేర్కొంది. ఈ నెల 28 వరకు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అమెరికా రాయబార కార్యాలయం సృష్టం చేసింది. ఈస్టర్ రోజున జరిగిన వరుస పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ ఆదేశ రక్షణ శాఖ మంత్రి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు.













