వీసా కోసం అదనపు వివరాలు ఇవ్వాల్సిందే…
అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారి నుంచి మరిన్ని అదనపు వివరాలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది. దరఖాస్తుదారుల పాత ఫోన్ నెంబర్లు, ఈ-మెయిళ్లతోపాటు, అన్ని సోషల్మీడియా ఖాతాల వివరాలనూ తీసుకోవాలనుకుంటున్నది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్ లో ప్రభుత్వం ఓ ముసాయిదాను పోస్టు చేసింది. దీనిపై 60 రోజుల్లో ప్రజలు తమ స్పందన తెలియజేయాలని అధికారులు కోరారు. ప్రజాసమ్మతి లభిస్తే ఈ వివరాలను వీసా దరఖాస్తు ప్రక్రియలో చేర్చనున్నట్లు తెలుస్తున్నది. అమెరికాకు ముప్పు కలిగించే వ్యక్తులు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.













