అమెరికాలో పర్యాటక వీసాల గడువు పొడిగింపు
భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నది. పర్యాటక వీసా వచ్చినవారిలో గడువు పూర్తయినవారు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్)కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. పరిశీలించి, వీసా గడువును పొడిగిస్తామని చెప్పారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైన వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు హెచ్1బీ వీసా గడువు ముగిసినవారికి సైతం మరి కొంత కాలం పాటు ఇక్కడే ఉండేలా వెసులుబాటు కల్పిస్తామన్నారు.













