పాక్ కు మరో ఎదురు దెబ్బ
పాకిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా తన దేశంలో ఉన్న పాక్ దౌత్య రాయబారులు, అధికారులపై ఆంక్షలు విధించింది. మే 1 నుండి అమలయ్యే ఆంక్షల ప్రకారం 40 కిలోమీటర్ల పరిధిని దాటి వెళ్లాలంటే అమెరికా అధికారుల అనుమతులు తీసుకోవాలి. ఇటీవల పాకిస్థాన్‌లో ఉన్న అమెరికా దౌత్య అధికారులపై గిరిజన ప్రాంతాలకు వెళ్లద్దంటూ ఆంక్షలు విధించింది. ఇందుకు ప్రతిగా అమెరికా పాక్ దౌత్యవేత్తలపై కఠిన ఆంక్షలు విధించిందని అమెరికా మీడియా తెలిపింది. అమెరికా రాజకీయ వ్యవహారాల సహాయ మంత్రి థామస్ షన్నవ్ వాయిస్ ఆఫ్ అమెరికాతో మాట్లాడుతూ చర్యకు ప్రతి చర్యగా అమెరికాలో పాక్ దౌత్యవేత్తలపై ఆంక్షలు విధించిందని అన్నారు. ఇలాంటి ట్రావెల్ ఆంక్షలు విధించటం దౌత్య వ్యవహారాలలో సర్వసాధారణమని అన్నారు. అలు పాకిస్థాన్ అధికారులు అమెరికా విధించిన ఆంక్షలను ధృవపరిచారు.













